వ్యర్ధాలు నుండి పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణ ఆరోగ్యం సంపద పెంచుకోవడం

by capitalmedianews.com

వ్యర్ధాల నుండి పచ్చదనం, ఆదాయం, ఆరోగ్యం , అర్థవంతమైన అభివృద్ధి
– విజయవంతంగా ముగిసిన ఆర్ట్ మినియేచర్స్, ఇంటి పంట మేళా
వ్యర్ధాల నుండి పచ్చదనం, ఆదాయం, ఆరోగ్యం , అర్థవంతమైన అభివృద్ధి సాధించడం కోసం నిర్వహించిన మేళా విజయవంతంగా ముగిసింది. మురళీనగర్ లోని ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ మేళా కు వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, జివిఎంసి అధికారులు, నగరవాసులు హాజరై జయప్రదం చేశారు. రమాదేవి ఏర్పాటు చేసిన మినియేచర్లు పిల్లలకూ, పెద్దలకూ అవగాహన కల్పించేందుకు బాగా ఉపకరించింది. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయడానికి నగరం లోని విభిన్న ప్రాంతాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ లు నిర్వహించాలి అని జివిఎంసి డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ కోరారు. వ్యర్ధాల నుండి తయారు చేసిన ఇతర కార్యక్రమాలు, నిర్వాహకులునూ భాగస్వామ్యులు చేసి ముందుకు తీసుకు వెళ్దాం అన్నారు.
ఈ ఎగ్జిబిషన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ఉదయ్ కుమార్ ఆయిల్ పెయింటింగ్స్ సజీవంగా, కళ్ళకు కట్టినట్లు దర్శనమిచ్చాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు అభినందనలు పొందాయి

ఫంక్షన్ హాల్ మీద సరిత తక్కువ స్థలంలో వెర్టికల్ విధానం లో, మిశ్రమ పద్దతి లో పెంచుతున్న కూరగాయల తోట అమోఘంగా ఉంది. వీక్షించిన నగరవాసులంతా ఇదే విధానంలో వ్యర్థం నుండి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయలు పండించుకునేందుకు తాము సైతం కృషి చేస్తామన్నారు
సోమవారం సాయంత్రం నిర్వహించిన ముగింపు సభలో జివిఎంసి సిఎం ఒ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేలా కృషి చేస్తున్న వారందరినీ అభినందించారు. ప్రధానంగా విద్యాశాఖ అధికారులు, జీవిఎంసి సిబ్బంది, అధికారులు ఇటువంటివి వీక్షించాలని కోరారు. ఎకో వైజాగ్ కోసం నిరంతర కృషి చేస్తున్నామని ఈ ఎగ్జిబిషన్ కూడా నగరం అంతటా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతాను. విశాఖపట్నాన్ని పచ్చదనం తో కళకళలాడెలా చేసేందుకు మనమంతా కంకణ బద్దులై కృషి చేద్దాం అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించిన ఉదయ్ కుమార్, మినియేచర్స్ ఎగ్జిబిషన్ నిర్వహించిన రమాదేవి లను శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మల్లా సరిత, అరుణ అరవల, కైట్స్ స్కిల్స్ ప్రైవేటు సంస్థ నిర్వాహకులు జ్యోతి నాదెళ్ల, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles