ప్రెసిడెన్షియల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు || GENESIS (జెనిసిస్ ) – అనేది ఒక గొప్ప అంశం

by capitalmedianews.com

ప్రెసిడెన్షియల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

విశాఖపట్నం 9 నవంబర్ 2024 : ప్రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో తమ 30వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నాది. GENESIS (జెనిసిస్ ) – అనేది ఒక గొప్ప అంశం, , ప్రతి కల ఎక్కడ పుడుతుంది, ప్రతి ఆలోచన ఎలా రూపుదిద్దుకుంటుంది మరియు ప్రతి ప్రయాణం ఆరంభం వీటితో వేడుకలు మొదలవుతాయి. ఈ జెనిసిస్ పదానికి విస్తృత వివరణ ఉంది, అదే ఈ సాయంత్రం వేడుకలను నడిపించినది.

మా స్కూల్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీ D.S.ఆనంద్ దార్శనికతలో 1994 లో ప్రారంభమైన ఈ పాఠశాల ఎల్లప్పుడూ విద్య రంగంలో దీటుగా నిలుస్తూ, మన తీరప్రాంత నగరంలో అత్యుత్తమ విద్యా కేంద్రాలలో ఒకటి అనటంలో సందేహం లేదు.

జెనెసిస్ అనేది ఒక వేడుక, ఇందులో విద్యార్థులు వివిధ రకాల నృత్య ప్రదర్శనలు, పాటలు మరియు స్కిట్స్ లను తమ ప్రతిభాపాటవములతో ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసారు. మన దేశ వైవిధ్యమైన గొప్ప సంస్కృతి, భౌగోళిక సరిహద్దులను అధిగమించే ప్రపంచ ఐక్యత, ఆధ్యాత్మిక మరియు తాత్విక భావనలు మరియు వాతావరణ మార్పు వంటి వాటితో సమ్మిళితమైన వినోదం కార్యక్రమాలు ఇందులో భాగమే. విద్యార్థులు ప్రదర్శించిన ఒక హిందీ నాటకం – ఖోయా బసంత్” ద్వారా భారతదేశంలోని అణగారిన ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవికమైన కష్టాలను వివరించి, అలాటి దోపిడీ విధానం అంతం చేయాలని, ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులను కల్పించాలనే సందేశాన్ని ఇచ్చారు.

ప్రెసిడెన్షియల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలలో గౌరవ ముఖ్య అతిధిగా శ్రీ శ్రీభరత్, పార్లమెంట్ సభ్యులు మరియు గీతం డీమ్డ్ యూనివర్సిటీ అధ్యక్షులు పాల్గొని, ఆయన ఒక “ స్పేస్ ల్యాబ్ “ ఆవిష్కరించారు. ఈ వేడుకలలో గౌరవ అతిధులుగా శ్రీ దేబాసిష్ చక్రవర్తి, మాజీ డైరక్టర్, DRDO, ADRDE, ఆగ్రా, శ్రీమతి వందన ఆనంద్ అబ్రహాం, డైరక్టర్, టీంపనీ స్కూల్ మరియు ప్రత్యేక అతిధిగా కోన శ్రీకర్ భరత్, ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ పాల్గొన్నారు.

ఈ వేడుకల వేదిక పైన ప్రెసిడెన్షియల్ స్కూల్ మాసపత్రిక నవంబర్ సంచిక ఆవిష్కరించారు మరియుప్రెసిడెన్షియల్ విద్యార్థులు రచించిన మరియు సంకలనం చేసిన గద్యాలు, కవితలు మరియు కళల గుర్తించి సంపాదకీయ బృందాన్ని సత్కరించారు. విద్యా , సాంస్కృతిక రంగాలలో మరియు కో-కరిక్యులర్ కార్యక్రమాలలో విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తించి ప్రముఖులు ప్రశంసించారు మరియు సత్కరించారు.

ఈ వేడుకలు విద్య పట్ల నిబద్ధతతో నూతన అవకాశాలను అన్వేషిస్తూ, నూతన స్ఫూర్తితో ముందుకు సాగాలనే ప్రేరణతో ఆనందంగా మరియు ఆశాజనకంగా ముగిశాయి.

Use Social Media to Spread the Word about Our News

related articles